TRS government failures : Chandrababu strategy on KCR | Oneindia Telugu

2017-12-09 426

Telugu Desam Party chief and Andhra Pradesh CM Nara Chandrababu Naidu met with Telangana TDP leaders and was informd about KCR government failures.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధైర్యం నూరిపోశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 18న ఎన్టీఆర్‌ వర్ధంతి రోజు నుంచి మార్చి 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు తెలంగాణ అంతటా పల్లెపల్లెన తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు రాష్ట్ర నేతలకు చంద్రబాబు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యనేతలందరితో శుక్రవారం సుదీర్ఘంగా ఐదు గంటల పాటు ఆయన సమావేశమయ్యారు.
పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో మొదట గంటన్నర, ఆ తరవాత ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. గత నెలరోజులుగా తెలంగాణలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలపై రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు వివరణ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు.